*హిందూ ఉత్సవ సమితికి రూ.3,51,000 విరాళం అందించిన ఎమ్మెల్యే బీయంఆర్..*
హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్సవ కార్యక్రమాల కోసం రూ.3,51,000/- విరాళాన్ని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు అందజేశారు.
ఈ విరాళం హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ గారికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు అందించారు.
⚡ *హిందూ ఉత్సవ సమితి అభివృద్ధికి అండగా ఎమ్మెల్యే బీయంఆర్..*
తాండూర్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్ మార్గంలో హిందూ ఉత్సవ సమితికి భూమి కేటాయించడంతో పాటు, దాదాపు రూ. 85 లక్షలతో హిందూ ఉత్సవ సమితి భవనం మరియు ప్రహరీ గోడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గారు తెలిపారు.
భవిష్యత్‌లో కూడా హిందూ ఉత్సవ సమితికి తన వంతు సహాయ సహాకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు పేర్కొన్నారు.
ఈ ఏడాది తాండూర్ పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ముఖ్యమైన పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గారు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు,కౌన్సిలర్లు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.







