_ తాండూరులో పొట్లి మహారాజ్ దేవస్థాన పునర్నిర్మిత నిర్మాణాల ప్రారంభోత్సవం
_ ఆహ్వానిస్తున్న దేవస్థానం ఛైర్మన్ ఎస్. ప్రసాద్ గౌడ్
తాండూరు, అక్టోబర్ 12(అభయం న్యూస్): తాండూరు పట్టణంలోని శ్రీ సద్గురు పొట్లి మహారాజ్ దేవస్థాన ప్రాంగణంలో నూతనంగా పునర్నిర్మించిన నిర్మాణాల ప్రారంభోత్సవ మహోత్సవం ఈ నెల 15వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ ఎస్. ప్రసాద్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
అక్టోబర్ 15 గురువారం ఉదయం 10:00 గంటలకు దేవస్థాన ప్రాంగణంలో ఈ కార్యక్రమం వైభవంగా ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ శుభకార్యానికి పట్టణ ప్రజలు, భక్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు ఆత్మీయులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.







