అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330
_ పలు శాఖల అధికారులకు ధన్యవాదాలు తెలిపిన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు
అభయం ప్రతినిధి తాండూరు: తాండూరు పట్టణంలో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనోత్సవం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ నిమజ్జన కార్యక్రమం దాదాపు 24 గంటల పాటు నిరంతరాయంగా సాగింది. చిన్న విఘ్నేశ్వరులు మినహాయించి, దాదాపు 320కి పైగా పెద్ద గణనాథులను సశాస్త్రీయంగా నిమజ్జనం చేసినట్లు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు, మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె తాండూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ — భక్తులు వినాయక నిమజ్జనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తే, సకాలంలో భగవంతుని ఆశీస్సులు అందరికీ లభిస్తాయని పేర్కొన్నారు. నిమజ్జనం ఆలస్యం కావడం వల్ల పడే శ్రమను దృష్ట్యా భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక కృషితో నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. ప్రజలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రైల్వే గేట్ వద్ద తాత్కాలికంగా రోడ్డు నిర్మించడం, గేట్ తెరిపించడం వంటి చర్యలు చేపట్టారన్నారు.అంతేకాకుండా ఆర్డీఓ, రెవెన్యూ, విద్యుత్, అటవీ శాఖల అధికారులతో ముందస్తుగా సమావేశం నిర్వహించి, నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు నిమజ్జనం పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షించారని, తాండూరు ప్రజలపై మరియు ప్రజాప్రతినిధులపై భగవంతుని కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మాజీ మార్కెట్ చైర్మన్ పెట్లోళ్ల నర్సింలు హిందూ ఉత్సవ సమితి సభ్యులు రామకృష్ణ, రాజు గౌడ్, జంటుపల్లి వెంకట్ తదితరులు ఉన్నారు.
We use essential cookies for login/session so the site works.
With your consent we also use analytics cookies to improve CS News.
Read our Privacy Policy.