_ ఎమ్మెల్సీ ఓటరు నమోదులో పట్టభద్రులు భాగస్వాములు కావాలి
_ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు పిలుపు
_ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటరు నమోదుపై సమీక్ష
తాండూరు,అక్టోబర్ 29(అభయం న్యూస్): రంగారెడ్డి – మహబూబ్నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని తాండూరు నియోజకవర్గంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై నాయకుల సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా బాతుల నాగరాజు మాట్లాడుతూ... పట్టణ పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. గ్రాడ్యుయేట్లకు ఓటరు నమోదులో ఎలాంటి సందేహాలు ఉన్నా, దరఖాస్తు ప్రక్రియలో సహాయం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఓటరు నమోదు వివరాలు, సందేహాల నివృత్తి కోసం పట్టభద్రులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని గానీ, కౌన్సిలర్లు, పార్టీ వార్డు అధ్యక్షులను గానీ సంప్రదించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలని నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు బంటు వేణు, జంటుపల్లి వెంకట్, ఎల్లప్ప తదితరులు, వార్డు కమిటీ అధ్యక్షులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి
By Vamshi · · Updated
Share this article







