Tandur

లైబ్రరీ లో స్టడీ మెటీరియల్..!

By · · Updated

Share this article
లైబ్రరీ లో స్టడీ మెటీరియల్..!

_ తాండూరు గ్రంథాలయానికి బీఎంఆర్ ఫౌండేషన్ ఉచిత స్టడీ మెటీరియల్
_ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో నిరుద్యోగ యువతకు చేయూత
_ తెలుగు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు పంపిణీ

తాండూరు, అక్టోబర్ 29(అభయం న్యూస్): తాండూరు పట్టణంలోని గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సౌలభ్యం కోసం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండింటిలోనూ నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ను గ్రంథాలయానికి సమకూర్చడం జరిగింది. ఆర్థిక స్థోమత లేని పేద నిరుద్యోగ యువతకు పుస్తకాలు కొనుగోలు చేయడం భారంగా మారిన తరుణంలో, ఈ ఉచిత మెటీరియల్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు, బీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు మరియు స్థానిక యువతీయువకులు పాల్గొని, నిరుద్యోగుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి మరియు ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెటీరియల్‌ను గ్రంథాలయ సద్వినియోగం చేసుకొని యువత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

Tags: