_ గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు పురోగతిపై ఆరా
_ ఆర్డీవో కర్ర అనితను కలిసిన బీఆర్ఎస్ నాయకులు
తాండూరు, అక్టోబర్ 31 (అభయం న్యూస్): హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం తాండూరు ఆర్డీవో కార్యాలయంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, ఆర్డీవో కర్ర అనితను ఎన్నికల తాండూరు సమన్వయకర్త విప్లవ్ కుమార్, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీశైల్ రెడ్డితో కలిసి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎంతమంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారో అడిగి తెలుసుకున్నారు. అలాగే నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక, క్షేత్రస్థాయి సమస్యలను అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆర్డీవో కర్ర అనిత సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, నమోదు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, మండలాల అధ్యక్షులు నర్సిరెడ్డి, వీరేందర్ రెడ్డి, కోహిర్ శ్రీనివాస్, పెద్దేముల్ సర్పంచ్ డి.వై. నర్సింలు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పెట్లోళ్ల దీపా నర్సింలు, టౌన్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ సలీం, మహిళా నాయకురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై ఆరా
By Vamshi · · Updated
Share this article







