Tandur

కార్మికుడికి అండగా మున్సిపల్ చైర్‌పర్సన్

By · · Updated

Share this article
కార్మికుడికి అండగా మున్సిపల్ చైర్‌పర్సన్

_ ఊపిరితిత్తుల సమస్యతో కార్మికుడికి అస్వస్థత

_ తక్షణమే స్పందించిన కౌన్సిలర్, ఆర్థిక సాయం అందించిన చైర్‌పర్సన్ 

_ కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు 

తాండూరు, అక్టోబర్ 31(అభయం న్యూస్) : పాత తాండూరు 15వ వార్డ్ కు చెందిన మున్సిపల్ కార్మికుడు జె. నవీన్ కుమార్ ఊపిరితిత్తుల సమస్యతో అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన అత్యవసర వైద్యం నిమిత్తం కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు.
కార్మికుడి నిరుపేద పరిస్థితిని, ఆరోగ్య క్షీణతను గమనించిన 15వ వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప... ఈ విషయాన్ని వెంటనే మున్సిపల్ చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. వార్డు కౌన్సిలర్ విన్నపంపై తక్షణమే స్పందించిన చైర్‌పర్సన్, వైద్య ఖర్చుల నిమిత్తం బాధితుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఆపద సమయంలో చొరవ చూపి ఆర్థికంగా ఆదుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ దివిటి ఎల్లప్పలకు బాధితుడి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags: