Tandur

విభేదాలు లేవు.. అందరం కలిసి పనిచేస్తాం!

By · · Updated

Share this article
విభేదాలు లేవు.. అందరం కలిసి పనిచేస్తాం!

_ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో బషీరాబాద్ మండల నాయకుల భేటీ
_ కాంగ్రెస్ పార్టీకి బషీరాబాద్ కంచుకోట: మండల నేతలు

బషీరాబాద్,అక్టోబర్ 29(అభయం న్యూస్): కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, నాయకులమందరం ఏకతాటిపై ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని బషీరాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో బషీరాబాద్ మండలానికి చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మండలంలోని రాజకీయ పరిస్థితులు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ.. బషీరాబాద్ మండలం మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీకి బలమైన కంచుకోట అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా పుంజుకున్నాయని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో బషీరాబాద్‌పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రేపు మండలంలో నిర్వహించనున్న ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలమందరం కలిసికట్టుగా పాల్గొంటామని చెప్పారు. పార్టీలో విభేదాలు ఉన్నాయంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను కార్యకర్తలు, ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Tags: