అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330
_ మాజీ ఎమ్మెల్యే అవినీతిని కప్పిపుచ్చేందుకే బిఆర్‌ఎస్ నాయకుల డ్రామాలు
_ తాండూరు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
అభయం ప్రతినిధి, తాండూరు:మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన భూ ఆక్రమణలు, అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని కోరితే బిఆర్‌ఎస్ నాయకుడు రుద్రు పాటిల్ నోటికొచ్చినట్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజు గౌడ్ మండిపడ్డారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పై రుద్రు పాటిల్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రాజు గౌడ్ ఓ ప్రకటనలో మాట్లాడుతూ... సొంత వార్డులో అభివృద్ధి కూడా చేయలేని వారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నమ్మకంతో గెలిపిస్తే వార్డును గాలికి వదిలేసి, ఉనికి కాపాడుకోవడం కోసం అనవసరమైన విషయాలను వెలిక్కి తీస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. గత ఐదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో తాండూరులో జరిగిన అక్రమాలు, రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ వ్యవహారాలు, భూకబ్జాల గురించి నియోజకవర్గ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని ఆయన అన్నారు. తమ నాయకుడి అక్రమాలు బయటపడతాయనే భయంతోనే రుద్రు పాటిల్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇక నిధుల మళ్లింపుపై మాట్లాడటం రుద్రు పాటిల్ అజ్ఞానానికి నిదర్శనమని రాజు గౌడ్ వ్యాఖ్యానించారు. తాండూరు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కట్టుబడి ఉన్నారని, కొడంగల్‌కు నిధులు తరలిస్తున్నారనడం శుద్ధ అబద్ధమని అన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో పడకేసిన తాండూరు అభివృద్ధిని మళ్లీ పరుగులు తీర్చేందుకు ఎమ్మెల్యే రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు. చౌకబారు విమర్శలు మాని, ధైర్యముంటే తాండూరులో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని రాజు గౌడ్ సవాల్ విసిరారు.
We use essential cookies for login/session so the site works.
With your consent we also use analytics cookies to improve CS News.
Read our Privacy Policy.