Tandur

వైద్యవిద్యకు ‘మారేపల్లి’ కందం..!

By · · Updated

Share this article
వైద్యవిద్యకు ‘మారేపల్లి’ కందం..!

 

 _ ఎంబిబిఎస్  సీటు సాధించిన గ్రామీణ విద్యార్థిని మహేశ్వరి

 _ ప్రత్యేకంగా సత్కరించి ఆర్థిక సాయమందించిన శ్రీనివాస్ రెడ్డి 

అభయం తాండూరు:  పట్టుదల, క్రమశిక్షణ ఉంటే గ్రామీణ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని  ఆర్బిఓఎల్  సీఈఓ,  కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన చెన్నప్ప కుమార్తె  మహేశ్వరి జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్  సీటు సాధించిన సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి  ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ మేరకు మహేశ్వరిని శాలువాతో సత్కరించి, ఆమె ఉన్నత చదువుల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహేశ్వరి కష్టపడి చదివి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి పేద ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఆమె చదువుకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి సహాయం అవసరమైనా సంప్రదించాలని, తన వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తానని  బుయ్యని శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Tags: