Tandur

ఉపాధ్యాయుల హక్కుల సాధనే లక్ష్యం:

By · · Updated

Share this article
ఉపాధ్యాయుల హక్కుల సాధనే లక్ష్యం:

_ పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గంలో యాలాల మండలానికి ఘన ప్రాతినిధ్యం

_ 11 మంది ఉపాధ్యాయులకు చోటు

 _ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సుంకరి బిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా భట్టాపురం మధుసూధన్ రెడ్డి

 ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడతాం: ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

యాలాల, అక్టోబరు 16 (అభయం న్యూస్): పీఆర్టీయూ  తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గంలో వికారాబాద్ జిల్లా యాలాల మండలం నుంచి 11 మంది ఉపాధ్యాయులకు చోటు లభించింది. నల్గొండలోని జీఎంఆర్ గార్డెన్‌లో శుక్రవారం  నిర్వహించిన పీఆర్టీయూ  రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సుంకరి బిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా భట్టాపురం మధుసూధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా యాలాల మండలం నుంచి పి. మహేష్ కుమార్, సి. కృష్ణ రెడ్డి, శెట్టి విజయ్ కుమార్, యు. వెంకట్ రెడ్డి, ఏ. ప్రభాకర్ రెడ్డి, యు. లక్ష్మయ్య, బి. కరుణాకర్ రెడ్డి, టి. కృష్ణయ్య, అనిల్ కుమార్, మల్లమ్మ, ఎన్. కిష్టమ్మలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. మండల స్థాయి నుంచి 11 మందికి రాష్ట్ర కమిటీలో ప్రాతినిధ్యం లభించడం పట్ల ఉపాధ్యాయ లోకం హర్షం వ్యక్తం చేసింది.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ... ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డుల సమస్యలతో పాటు గురుకుల, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో పలుమార్లు గళం వినిపించినట్లు తెలిపారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. 
రాష్ట్ర కార్యవర్గానికి ఎంపికైన 11 మంది ఉపాధ్యాయులకు పీఆర్టీయూ  రాష్ట్ర యాలాల మండల శాఖ అధ్యక్షులు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పరమేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నూతన కార్యవర్గం ఉపాధ్యాయుల హక్కుల సాధనకు, సంక్షేమానికి కృషి చేయాలని, నూతన నాయకత్వంలో సంఘం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

Tags: