Tandur

ఉదారత చాటుకున్న డాక్టర్ సంపత్ కుమార్

By · · Updated

Share this article
ఉదారత చాటుకున్న డాక్టర్ సంపత్ కుమార్

_ బుడగ జంగం కాలనీలో తాగునీటి బోరు ప్రారంభం

_ సొంత ఖర్చులతో బోరు వేయించి నీటి కష్టాలు తీర్చిన శ్రీ బాలాజీ ఆసుపత్రి అధినేత

_ దాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కాలనీవాసులు

అభయం తాండూరు టౌన్: పట్టణంలోని 2వ వార్డు పరిధిలోని బుడగ జంగం కాలనీవాసుల దశాబ్దాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ పూర్తి ఆర్థిక సహకారంతో శనివారం కాలనీలో నూతనంగా తాగునీటి బోరుబావిని వేయించారు.
గత కొంతకాలంగా తాగునీటి కోసం కాలనీవాసులు పడుతున్న అవస్థలను స్థానిక నాయకుడు మోడెం కృష్ణ డాక్టర్ సంపత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే సానుకూలంగా స్పందించిన సంపత్ కుమార్, బోరు తవ్వకానికి అయ్యే పూర్తి ఖర్చును స్వయంగా భరించారు. శనివారం బోరు వేయించడంతో పుష్కలంగా నీరు పడటంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. తమ దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ సంపత్ కుమార్‌కు కాలనీ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags: