Tandur

త్వరలోనే ఖరారు...!

By · · Updated

Share this article
త్వరలోనే ఖరారు...!

_ పొట్లి మహారాజ్ గుడి చైర్మన్‌గా సుదర్శన్ గౌడ్‌ను ప్రకటించాలి
 
_ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి గౌడ సంఘం నాయకుల విజ్ఞప్తి
 
_ సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే: కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్ గౌడ్

అభయం తాండూరు టౌన్;  తాండూర్ పట్టణంలోని  పొట్లి మహారాజ్ దేవాలయ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోరేపల్లి సుదర్శన్ గౌడ్‌ను నియమించాలని గౌడ సంఘం నాయకులు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
గత 25 సంవత్సరాలుగా పొట్లి మహారాజ్ ఆలయ నిర్వహణతో పాటు చైర్మన్ పదవిని గౌడ కులస్తులకే కేటాయిస్తున్న ఆనవాయితీ కొనసాగుతోందని, అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈసారి సుదర్శన్ గౌడ్‌కే ఈ బాధ్యతలు అప్పగించాలని తాజాగా గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కోరిన విషయం తెలిసిందే. 
గౌడ సంఘం నాయకుల అభ్యర్థనపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎంతగానో సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రభాకర్ గౌడ్ ఈ సందర్బంగా తెలిపారు. సుదర్శన్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని త్వరలోనే ఎమ్మెల్యే అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభాకర్ గౌడ పేర్కొన్నారు. గౌడ సామాజిక వర్గ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని చైర్మన్ పదవి కేటాయింపుకు  స్పందించిన  ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళి గౌడ్, మాజీ చైర్మన్ ప్రవీణ్ గౌడ్, గౌడ సంఘం ప్రముఖ నాయకులు రాజు గౌడ్, రవి గౌడ్, రమేష్ గౌడ్, వెంకటరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: