_ తాండూర్ నియోజకవర్గ ఇంచార్జిగా బుస్సా రాఘవేందర్ రెడ్డి
_ జనరల్ సెక్రటరీగా వీరమణి నియామకం
తాండూరు,అక్టోబర్ 24(అభయం న్యూస్): తెలంగాణ రక్షణ సేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే ఉద్దేశంతో పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ప్రకటించారు.
ఇందులో భాగంగా తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా బుస్సా రాఘవేందర్ రెడ్డిని నియమించినట్లు ఆమె అధికారికంగా వెల్లడించారు. అలాగే తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గ జనరల్ సెక్రటరీగా వీరమణిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పార్టీ బలోపేతానికి నూతనంగా నియమితులైన నాయకులు సైద్ధాంతిక భావజాలంతో ముందుకు సాగాలని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలని పార్టీ అధ్యక్షురాలు కవిత ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నియామకాల పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ నూతన ఇంచార్జికి, జనరల్ సెక్రటరీకి శుభాకాంక్షలు తెలిపారు.
టీఆర్ఎస్ ఇంచార్జిగా రాఘవేందర్ రెడ్డి
By Vamshi · · Updated
Share this article







