Tandur

తప్పులకు తావులేకుండా చూడాలి..!

By · · Updated

Share this article
తప్పులకు తావులేకుండా చూడాలి..!

_ ఎమ్మెల్సీ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి
_ రోజువారీగా 10 శాతం దరఖాస్తులు పూర్తి చేయాలి
_ అధికారులకు తాండూరు ఆర్డీవో ఆదేశం

తాండూరు, అక్టోబరు 29 (అభయం న్యూస్): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫారం–18 ద్వారా అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని తాండూరు రెవెన్యూ డివిజనల్ అధికారి అధికారులను ఆదేశించారు. గురువారం డివిజన్ కార్యాలయంలో సంబంధిత సిబ్బందితో నిర్వహించిన సమావేశం నిర్వహించారు.
అర్హులైన పట్టభద్రుల దరఖాస్తులను ఎన్నికల నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత వివరాలను ధృవీకరించాలని సూచించారు. ప్రతి రోజూ కనీసం 10 శాతం దరఖాస్తులను పరిశీలించి, ప్రక్రియ పూర్తయిన ఫారమ్‌లను వెంటనే సంబంధిత ఏఈఆర్‌ఓ కార్యాలయానికి పంపించాలని స్పష్టం చేశారు. భౌతికంగా స్వీకరించిన ఫారం–18 దరఖాస్తులను రిజిస్టర్‌లో నమోదు చేసి, అదే రోజు సాఫ్ట్‌వేర్‌లో డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు.
ఆన్‌లైన్ ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో ధృవీకరించి నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.

Tags: