_ తాండూరు బిగ్ బాష్ లీగ్-13 ప్రారంభం
_ క్రీడలతోనే మానసిక ఉల్లాసం, నైపుణ్యాలకు గుర్తింపు
_ పట్టణంలో స్టేడియం నిర్మాణానికి శ్రమిస్తా: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు,అక్టోబర్ 15(అభయం న్యూస్): పట్టణంలోని జూనియర్ కాలేజ్ మైదానంలో గురువారం ‘తాండూర్ బిగ్ బాష్ లీగ్-13’ క్రికెట్ టోర్నమెంట్ కోలాహలంగా ప్రారంభమైంది. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. టాస్ వేసి టోర్నీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత దురలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. తాండూరు ప్రాంతంలో క్రీడారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు క్రీడాకారులకు అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. ముఖ్యంగా పట్టణంలో త్వరలోనే అధునాతన క్రీడా స్టేడియం నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని రోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, తాండూరు మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, కౌన్సిలర్ యోగానంద్ తో పాటు నాయకులు వరాల శ్రీనివాస్ రెడ్డి, భీమ్ సింగ్, చెనబసప్ప, హకీమ్ ఖాన్, ఇంతియాజ్, మధు గౌడ్, చెన్నారెడ్డి, చందర్, అస్ఫాక్, టీఆర్ఎస్వీ నాయకులు వినోద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.







