_28న 'బీఎంఆర్' ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
_ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రకటన
తాండూర్ టౌన్, అక్టోబరు 26(అభయం న్యూస్): పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయనున్నట్లు తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని విలియం మూన్ స్కూల్ ఆవరణలో ఈ నెల 28వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మరియు ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తాండూర్‌కు స్పీకర్ ప్రసాద్ కుమార్ రాక
By Vamshi · · Updated
Share this article







