Tandur

తల్లీ బిడ్డ మృతి..!

By · · Updated

Share this article
తల్లీ బిడ్డ మృతి..!

_ ఎంసీఎచ్లో ఘటన

_ వైద్యుల నిర్లక్షమే కారణం అంటున్న కుటుంబికులు 

అభయం తాండూరు: ప్రసవం కోసం వచ్చిన మహిళాకు పుట్టిన ఆడ బిడ్డతో సహా మృతి చెందిన సంఘటన తాండూరు లో నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం తోనే తల్లీ బిడ్డ మృతి చెందిందని కుటుంబికులు ఆరోపించారు. ఈ ఘటన తాండూరు సమీపంలోని మాత శిశు ఆసుపత్రి లో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.... తాండూరు మండలం జినుగుర్తికి చెందిన బాలమణికి కర్ణాటక రాష్ట్రం సెడేం సమీపంలోని అనంతపూర్ కు చెందిన రాజుతో కోనేళ్ల క్రితం వివాహం జరిగింది. మొదటి కాన్పు కోసం బాలమణి బుధవారం మాత శిశు ఆసుపత్రి కి తీసుకొచ్చారు. కొద్దీ సేపటికి వైద్యులు ప్రసవం చేశారు. ఆడ బిడ్డ పుట్టిన అనంతరం తల్లీ బిడ్డ మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. తల్లీ బిడ్డ మృతి చెందడం తో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దింతో విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక కౌన్సిలర్ జావీద్ ఆసుపత్రి కి చేరుకొని ఘటన వివరాలు తెలుసుకున్నారు. కౌన్సిలర్ జావీద్ కుటుంబ సభ్యులు వైద్యులతో వాగ్వదానికి దిగారు.

Tags: