Tandur

సీసీ రోడ్డుకు శ్రీకారం..!

By · · Updated

Share this article
సీసీ రోడ్డుకు శ్రీకారం..!

_ న్యూ ఆదిత్య ఆసుపత్రి నుంచి హనుమాన్ ఆలయం వరకు సీసీ రోడ్డు

_ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలసి వినతిపత్రం అందజేసిన కౌన్సిలర్లు

_ దీపావళి తర్వాత నిధుల మంజూరుకు హామీ

తాండూరు, అక్టోబర్ 20 (అభయం న్యూస్), 2026:  తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 10, 11వ వార్డు కు మధ్యలో ఉన్న మెయిన్ రోడ్డు  నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ స్థానిక కౌన్సిలర్లు బంటు వేణు, అల్లాపూర్ శ్రీకాంత్ స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి విన్నవించారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి వార్డు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
సాయిపూర్  మార్గంలో  ఉన్న న్యూ ఆదిత్య ఆసుపత్రి నుంచి హనుమాన్ దేవాలయం వరకు రహదారి అధ్వానంగా మారిందని, దీంతో స్థానికులు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, దీపావళి పండుగ ముగిసిన వెంటనే నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులను శాంక్షన్ చేయించి పనులు ప్రారంభమయ్యేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
సమస్య తెలిపిన వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు కౌన్సిలర్లు బంటు వేణు, అల్లాపూర్ శ్రీకాంత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నూతన రోడ్డు నిర్మాణంతో 10, 11వ వార్డుల ప్రజలకు రవాణా కష్టాలు తీరుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: