Tandur

సేవలాల్ సేవలో మిత్రు నాయక్..!

By · · Updated

Share this article
సేవలాల్ సేవలో మిత్రు నాయక్..!

_ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ ప్రత్యేక పూజలు

_ నవరాత్రి ఉత్సవాల వేళ క్షేత్రాన్ని దర్శించుకున్న బంజారా నాయకులు

_ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష

తాండూరు, అక్టోబర్ 14 (అభయం న్యూస్): గోర్ బంజారా సమాజ ఆరాధ్య దైవం, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మస్థలమైన మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా పౌరదేవి క్షేత్రాన్ని మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ దర్శించుకున్నారు. శరన్నవరాత్రి పవన మహోత్సవాలను పురస్కరించుకుని బుధవారం వారు క్షేత్రానికి చేరుకుని, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గద్దెకు, జగదాంబ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ మాట్లాడుతూ... సేవాలాల్ మహారాజ్ చూపిన ధర్మం, భక్తి, సమాజ సేవ మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. మహారాజ్ దివ్య ఆశీస్సులతో తాండూరు ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో తులతూగాలని, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. బంజారా సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

Tags: