_ శోభాయమానంగా తాత గుడి ఆవరణ.. పూల పండుగకు వేళాయె!
_ వాడవాడలా సిద్ధమైన మహిళామణులు
_ ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దంపతులు, ప్రమోదిని విఠల్ రెడ్డి
_ అందరూ రావాలి.. పండుగను దిగ్విజయం చేయాలి: మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దీప నర్సింలు పిలుపు
తాండూరు అక్టోబర్ 17 (అభయం న్యూస్): ఆశ్వయుజ మాసపు ఆనంద తరంగాలు, తంగేడు, గునుగు పూల గుబాళింపుల నడుమ తాండూరు పట్టణం బతుకమ్మ సంబరాలకు సిద్ధమైంది. సాయిపూర్ 9వ వార్డులోని తాత గుడి ఆవరణ రేపు ఆదివారం సాయంత్రం 4:00 గంటలకు ఉయ్యాల పాటలు, కోలాటాల కోలాహలానికి వేదిక కాబోతోంది.
ఈ సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తాండూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప నర్సింలు వెల్లడించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆర్తి రెడ్డి మరియు ప్రమోదిని విఠల్ రెడ్డి హాజరుకానున్నాట్లు తెలిపారు.
పట్టణంలోని వివిధ వాడల నుంచి వందలాది మంది మహిళలు రంగురంగుల బతుకమ్మలతో తరలివచ్చి ఆటపాటలతో సందడి చేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ. మన సాంప్రదాయ వైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహించే ఈ వేడుకకు తాండూరు పట్టణంలోని ప్రతి ఇంటా ఉన్న మహిళలు, యువతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలిని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప నర్సింలు తెలిపారు.
సాయిపూర్లో సంబరం..!
By Vamshi · · Updated
Share this article







