_ శాస్త్ర స్కూల్‌లో వైభవంగా బతుకమ్మ, దసరా వేడుకలు
_ ఆకట్టుకున్న రావణ దహనం – ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
తాండూరు అక్టోబర్ 10 (అభయం న్యూస్): పట్టణం లోని శాస్త్ర స్కూల్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. విద్యార్థినులు బతుకమ్మల చుట్టూ కోలాటాలు, ఆటపాటలు, నృత్య ప్రదర్శనలతో అలరించారు. అనంతరం చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ‘రావణ వధ - లంక దహనం’ ఘట్టాన్ని ప్రదర్శించారు. రావణుడి ప్రతిమను దహనం చేసి పండుగ సందేశాన్ని చాటారు. ఈ సందర్భంగా శ్రీరాముని విజయగాథను, సత్యం మరియు ధర్మం యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు.
చిన్నారుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకే ఇలాంటి వేడుకలను పాఠశాలలో నిర్వహిస్తున్నామని యాజమాన్యం పేర్కొంది. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులను, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకలతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.







