Tandur

సందీప్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

By · · Updated

Share this article
సందీప్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

_ యువనాయకుడు సందీప్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

 _ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు

అభయం ప్రతినిధి తాండూరు: కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు సందీప్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం తాండూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సందీప్ రెడ్డి చేత కేక్ కట్ చేయించి, ఆయనకు పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోనూ, ప్రజల సమస్యల పరిష్కారంలోనూ యువనాయకత్వం క్రియాశీలక పాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో సందీప్ కు మరిన్ని పదవులు లభించాలని ఆయన ఆకాంక్షించారు.
తన పుట్టినరోజును పురస్కరించుకుని ఆత్మీయంగా వేడుకలు నిర్వహించి, ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సందీప్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని, సందీప్ రెడ్డిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.

Tags: