_ తాండూరు కౌన్సిలర్ బంటు వేణు జన్మదిన వేడుకలు ఘనం
_ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేయించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
_ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
అభయం తాండూరు: తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు కౌన్సిలర్ బంటు వేణు జన్మదిన వేడుకలు వార్డు ప్రజలు, అభిమానులు మరియు కాంగ్రెస్ శ్రేణుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ జన్మదిన వేడుకలకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌన్సిలర్ బంటు వేణుతో కలిసి ప్రత్యేకంగా కేక్ కట్ చేయించిన ఎమ్మెల్యే, ఆయనకు పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా వార్డు అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండే నాయకుడు బంటు వేణు అని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా ఈ వేడుకల్లో తాండూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కౌన్సిలర్ వేణుకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వార్డులో వేణు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు పరిధిలోని కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కౌన్సిలర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల అనంతరం అభిమానులు, కార్యకర్తలు ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.







