Tandur

రైతులకు బిగ్ రిలీఫ్...!

By · · Updated

Share this article
రైతులకు బిగ్ రిలీఫ్...!
  • అకాల వర్ష బాధితులకు ఊరట
  • రూ.14 లక్షల పరిహారం పంపిణీ
  • 57 మంది రైతులకు నష్టపరిహార చెక్కులు అందజేత
  • చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

అభయం తాండూరు రూరల్: తాండూర్ మండలం సంగెంకలాన్ గ్రామంలో గత ఏడాది కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఊరట లభించింది. రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్న 57 మంది రైతులకు చెట్టినాడ్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో మంజూరైన సుమారు రూ.14 లక్షల విలువైన పంట నష్టపరిహారం చెక్కులను సోమవారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం జరిగేలా చొరవ తీసుకున్నామని తెలిపారు. సామాజిక బాధ్యతగా ముందుకొచ్చి రైతులకు ఆర్థిక సహాయం అందించిన చెట్టినాడ్ సిమెంట్ కంపెనీ యాజమాన్యాన్ని వారు అభినందించారు. ప్రభుత్వపరంగా, స్థానిక పరిశ్రమల సహకారంతో తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని పునరుద్ఘాటించారు.
అనంతరం, తమను ఆదుకున్నందుకు గాను ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు చెట్టినాడ్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులకు నష్టపోయిన రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags: