Tandur

దోచుకున్న వాటిపై విచారణ జరపండి...!

By · · Updated

Share this article
దోచుకున్న వాటిపై విచారణ జరపండి...!

_ రోహిత్ రెడ్డి ఆస్తులపై విచారణ అనడం హాస్యాస్పదం

 _ ఎమ్మెల్యే బీయంఆర్ ఆరోపణలపై బిఆర్ఎస్ నాయకుడు రుద్రు పాటిల్  కౌంటర్

 _ ముందుగా తాండూరు భూకబ్జాలపై విచారణ జరిపించాలని డిమాండ్ 

 _ తాండూరు నిధులను కొడంగల్‌కు తరలిస్తున్న ఎమ్మెల్యే రాజీనామా చేయ్యాలి 

అభయం ప్రతినిధి, తాండూరు:ఎకరాలు కొని బకరాలకు అమ్మే మీరు... మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆస్తులపై విచారణ జరపాలని మాట్లాడటం అత్యంత హాస్యాస్పదంగా ఉందని  తాండూరు బిఆర్ఎస్ నాయకుడు రుద్రు పాటిల్, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పై ఆరోపణలు చేశారు. 
ఈ విషయాలను స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుండే ప్రజలందరూ విన్నారని ఆయన గుర్తుచేశారు.
ఆదివారం  ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీడియా సమావేశం లో మాట్లాడిన మాటలను రుద్రు పాటిల్ ఖండించారు. ఈ సందర్బంగా .... రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేసే ముందు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరులో దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపించాలని రుద్రు పాటిల్ డిమాండ్ చేశారు. తాండూరు పట్టణ పరిధిలోని సర్వే నంబర్లు 111, 135, 130 లో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను కాజేశారంటూ తాము ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేని స్థితిలో మనోహర్ రెడ్డి ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తి రోహిత్ రెడ్డి పై, ఆయన ఫామ్‌హౌస్‌పై అనవసర విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు.
తాండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, పొరుగున ఉన్న కొడంగల్‌కు సేవలు చేయడం సిగ్గుచేటని రుద్రు పాటిల్ విమర్శించారు. తాండూరుకు రావాల్సిన నిధులు, ప్రభుత్వ కాలేజీలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్, తాగు/సాగు నీటి కేటాయింపులు తదితర వాటన్నింటినీ కొడంగల్‌కు తరలిస్తూ తాండూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇతర ప్రాంతాలకు నిధులు తరలిస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags: