అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330
_ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణకు డిమాండ్
అభయం ప్రతినిధి తాండూరు; స్వరాష్ట్రం తెలంగాణలో పదేళ్లపాటు సాగిన కల్వకుంట్ల కుటుంబ పాలనలో నిరుపేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో సాగిన ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమంగా నిర్మించిన ఫామ్‌హౌస్‌లను కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీయంఆర్ మాట్లాడుతూ... నాటి పాలకులు పేదోడికి కనీసం ఒక చిన్న ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేకపోయారని విమర్శించారు. స్వరాష్ట్రం కోసం ప్రజలు చేసిన పోరాట ఫలాలు సామాన్యులకు అందకుండా, కేవలం ఒకే ఒక్క కుటుంబానికే ప్రయోజనం చేకూరిందని ఆరోపించారు. తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్ భూములు, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని బీయంఆర్ డిమాండ్ చేశారు. గతంలో డ్రగ్స్ పార్టీలు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాల వంటి వివాదాస్పద ఘటనలన్నీ ఈ ఫామ్‌హౌస్‌లోనే జరిగాయని మండిపడ్డారు. ఇటువంటి చర్యల ద్వారా గత బీఆర్ఎస్ నాయకులు సమాజానికి, యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ పర్యటనలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, ఈర్లపల్లి శంకర్, నవీన్ యాదవ్‌లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
We use essential cookies for login/session so the site works.
With your consent we also use analytics cookies to improve CS News.
Read our Privacy Policy.