Tandur

రూట్ మ్యాప్ పాటించాలి ..!

By · · Updated

Share this article
రూట్ మ్యాప్ పాటించాలి ..!

_ శాంతియుత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించాలి

_ వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

_ తాండూర్ లో శోభాయాత్ర రూట్, నిమజ్జన ఘాట్ల పరిశీలన

అభయం తాండూరు ప్రతినిధి; 
తాండూర్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జనోత్సవాన్ని అత్యంత ప్రశాంత వాతావరణంలో, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పిలుపునిచ్చారు. గురువారం ఆమె తాండూర్ లో శోభాయాత్ర సాగే రూట్ మ్యాప్‌ను, కాగ్నా నది, భూకైలాష్, మాల్రెడ్డిపల్లి చెరువుల వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
అనంతరం తాండూర్ డీఎస్పీ కార్యాలయంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అధికారులు కేటాయించిన నిర్దేశిత ప్రాంతాల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని, పోలీసులు సూచించిన రూట్ మ్యాప్‌ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
శోభాయాత్రలో డీజేలు, బాణాసంచా వినియోగానికి ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. మద్యం లేదా గంజాయి సేవించి ఉత్సవాల్లో పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యుత్ తీగల వద్ద జాగ్రత్త వహించాలని, రద్దీ ప్రాంతాల్లో బారికేడ్లు, అవసరమైన చోట్ల లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉత్సవ కమిటీలు స్వచ్ఛంద వాలంటీర్లను నియమించుకుని పోలీసులకు సహకరించాలని కోరారు. ఏవైనా సమస్యలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసు టోల్‌ఫ్రీ నంబర్ 8712670056 కు సమాచారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా, తాండూర్ డీఎస్పీ యాదయ్య, టౌన్ ఇన్స్పెక్టర్ పరమేశ్వర్, మునిసిపల్ ఛైర్మెన్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Tags: