Tandur

రోడ్డు వేయ్యండి...!

By · · Updated

Share this article
రోడ్డు వేయ్యండి...!

_తాండూరులో అధ్వానంగా 32వ వార్డు రోడ్లు.. 

_ సీసీ రోడ్డు నిర్మించాలని అధికారులకు కౌన్సిలర్ విజ్ఞప్తి

అభయం తాండూరు; తాండూరు మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు  సీతారాంపేట్ లో రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారాయని, వెంటనే కొత్త రోడ్డును నిర్మించాలని స్థానిక వార్డు కౌన్సిలర్  మహేశ్వరి  మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ... వార్డులో రోడ్డు సమస్య తీవ్ర రూపం దాల్చడంతో స్థానికులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కాదన్నారు. రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల నిత్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, వృద్ధులు నడవడానికి కూడా నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు.
ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య మరింత జటిలమవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడినప్పుడు నీరు నిలిచిపోవడం, బురదమయంగా మారడంతో పాటు రాత్రి సమయాల్లో రాకపోకలు సాగించడం చాలా ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. ప్రజల ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి 32వ వార్డులో వెంటనే  రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని  కోరారు.

Tags: