Tandur

రక్తదానం – ప్రాణదానం..!

By · · Updated

Share this article
రక్తదానం – ప్రాణదానం..!

_ ఆపదలో ఉన్నవారికి రక్తదానం ప్రాణదానంతో సమానం

 _ బాచ్పన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం

 _ 30 యూనిట్ల రక్తం సేకరణ.. దాతలకు అభినందనలు 

అభయం తాండూరు టౌన్: ఆపదలో ఉన్న వారిని ఆదుకుని, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు పునర్జన్మ నివ్వాలనే ఉదాత్తమైన ఆశయంతో బాచ్పన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం ఘనంగా ముగిసింది. తాండూరులోని జేబీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కళ్యాణ్ మోహన్ రావు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి పట్టణ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. యువకులు, స్వచ్ఛంద కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని సుమారు 30 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.
ఈ కార్యక్రమానికి పిసిసి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు  ధరాసింగ్, 
 తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా  హాజరైయ్యారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ... బాచ్పన్ చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం సమాజహితం కోసం బాధ్యతాయుతమైన కార్యక్రమాలు చేపడుతుండటం అభినందనీయమని కొనియాడారు. రక్తదానం అనేది మానవత్వానికి నిజమైన ప్రతీక అని, ప్రతి ఒక్కరూ ఈ మహత్కార్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం డాక్టర్ కళ్యాణ్ మోహన్ రావు మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి శిబిరాలు వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయని తెలిపారు. ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్ మోహన్ కృష్ణ గౌడ్, అధ్యక్షుడు M.A. మతీన్ మాట్లాడుతూ.. రక్తదానం – ప్రాణదానం అనే నినాదంతో భవిష్యత్తులోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
ఈ రక్తదాన శిబిరంలో సెయింట్ మార్క్స్ హై స్కూల్ (1998–1999) పూర్వ విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సభ్యులు, స్థానిక యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ  చైర్మన్ బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బతుల నాగు, మాజీ అధ్యక్షుడు హబీబ్ లాలా, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు పాల్గొని దాతలను అభినందించారు. అలాగే ట్రస్ట్ ప్రతినిధులు నయీమ్, జి . రంజిత్ కుమార్, గాయత్రి, బి . రవికుమార్, విజయానంద్, త్యేబ్ ఈర్షద్, కిషన్ గోపాల్‌రాథి, బి. అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శిబిరాన్ని విజయవంతం చేసిన రక్తదాతలకు, సహకరించిన జేబీ హాస్పిటల్ సిబ్బందికి ట్రస్ట్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: