Tandur

రాజకీయ లబ్ది కోసమే తప్పుడు ప్రచారం..!

By · · Updated

Share this article
రాజకీయ లబ్ది కోసమే తప్పుడు ప్రచారం..!

_ హార్మొనీ వుడ్స్‌పై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు

 _ 2018లోనే పూర్తి టైటిల్ పరిశీలన తర్వాత భూమి కొనుగోలు

 _ అంతకుముందే ఐదు లావాదేవీలు జరిగాయన్న డెవలపర్లు

 _ ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ ఉన్నాయని వెల్లడి

అభయం తాండూరు: మహేశ్వరం మండలం తుమ్మలూరులో డెవలప్ చేస్తున్న ‘హార్మొనీ వుడ్స్’ ప్రాజెక్టుపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి అసత్య ప్రచారాలను ఏమాత్రం సహించేది లేదని డెవలపర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు జేబీ ఇన్‌ఫ్రా, భువన్ ఇన్‌ఫ్రా, కాంక్రీట్ ఇన్‌ఫ్రా సంస్థల ప్రతినిధులు ఓ  ప్రకటన విడుదల చేశారు.
తుమ్మలూరులోని సర్వే నంబర్లు 371, 372, 373, 377 పరిధిలోని భూమికి సంబంధించిన పూర్తి టైటిల్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే 2018లో కొనుగోలు చేసినట్లు డెవలపర్లు వివరించారు. తమ కొనుగోలుకు ముందే ఆ స్థలానికి సంబంధించి ఐదు లావాదేవీలు జరిగాయని, 2018లో నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ కొనుగోలు ప్రక్రియ చట్టబద్ధంగా పూర్తయిందని గుర్తుచేశారు.
తమ సంస్థలకు ఎలాంటి రాజకీయాలతోనూ సంబంధం లేదన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కొందరు తమ ప్రాజెక్టుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. హార్మొనీ వుడ్స్ అనేది  (రేరా) రిజిస్టర్డ్ ప్రాజెక్టు అని, ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పూర్తి అనుమతులతోనే నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావాతో పాటు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా హెచ్చరించారు.

Tags: