Tandur

రైస్ మిల్లు పేరుతో ₹45 లక్షల స్వాహా..!

By · · Updated

Share this article
రైస్ మిల్లు పేరుతో ₹45 లక్షల స్వాహా..!

_   పీఏసీఎస్ అక్రమాలపై రాజకీయ దుమారం

_ బిఆర్ఎస్  మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి

 _ ఆధారాలు ఉంటే బయటపెట్టాలని బహిరంగ సవాల్

 _ దళితులను అవమానిస్తే సహించేది లేదు: మెట్టి కృష్ణ హెచ్చరిక

అభయం న్యూస్ యాలల్:  యాలాల్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ అవకతవకలకు పాల్పడ్డారని, వారి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం యాలాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ... 
గత పీఏసీఎస్ పాలకవర్గం రైస్ మిల్లు పేరుతో దాదాపు ₹45 లక్షలు డ్రా చేసి, కనీసం యంత్రాలను కూడా అమర్చలేదని రవీందర్ రెడ్డి ఆరోపించారు. రూ. 2 కోట్ల మేర మిల్లర్ల మిషన్లు బిగించకుండా నిధులు ఎలా పొందుతారని ప్రశ్నించారు. తమ పాలకవర్గం చట్టబద్ధంగా కేసు నమోదు చేయడంతోనే ఈ అక్రమాలు వెలుగు చూశాయని తెలిపారు. నిధులు డ్రా చేసిన కాగితాలు, ఎంబీ  రికార్డులు, చెక్కుల రూపంలో తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, తప్పు చేయలేదని చెబుతున్న నాయకులు ఈ రికార్డులపై బహిరంగ చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు.
ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం మానుకుని మండలాల అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఉపాధి హామీ పథకం తప్ప గత కొన్ని నెలలుగా నాలుగు మండలాల్లో ఏ ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని విమర్శించారు. తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలను ఖండిస్తూ, దళిత బంధు నిధుల్లో అక్రమాలు జరిగాయని నిరూపిస్తే ఏ చర్యలకైనా సిద్ధమని, నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదే సమావేశంలో పాల్గొన్న దళిత నేత మెట్టి కృష్ణ మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ముందు 'సావు డప్పు' కొడతామని కొందరు వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితులు అంటే కేవలం డప్పు కొట్టేవారేనా? దళిత సమాజాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు అని ఘాటుగా హెచ్చరించారు.
ఈ  సమావేశంలో నాయకులు వడ్డే రాములు, మాజీ సర్పంచ్ అరవింద్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, లాలు ముదిరాజ్, శరణు, పేర్కొంపల్లి సర్పంచ్ నర్సింలు, మాజీ సర్పంచ్ పటేల్ రెడ్డి, శ్రీశైలం, మహేశ్వర్ రెడ్డి, కృష్ణ, మాజీ ఎంపీటీసీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: