_ యువకుడి కడుపులో కత్తి పోటు
_ స్నేహితులతో కలిసి మద్యం సేవించిన మునవార్
_ స్నేహితులపై అనుమానాలు
అభయం తాండూరు టౌన్: పట్టణంలోని రైల్వే క్వాటర్స్ లో ఓ యువకుడి మృతదేహం లభించింది. మాణిక్ నగర్ కు చెందిన మునవార్ ఆటో డ్రైవర్ గా గుర్తించారు. శుక్రవారం ఉదయం రైల్వే క్వాటర్స్ వద్ద మృతి చెంది కనిపించాడు. మునవార్ కడుపులో కత్తి పోటు ఉన్నట్టుగా పోలీసుల విచారణ లో తేలింది. అయితే మునవార్ తన స్నేహితుల తో కలిసి మద్యం సేవించినట్టు తెలుస్తుంది. ఈ మృతి పై పోలీసులు మునవార్ స్నేహితులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటన పై దర్యాప్తు చేపట్టినట్టు సీఐ పరమేశ్వర్ గౌడ్ వెల్లడించారు.







