Tandur

ప్రజాస్వామ్య పరిరక్షణకై కాంగ్రెస్ పోరు

By · · Updated

Share this article
ప్రజాస్వామ్య పరిరక్షణకై కాంగ్రెస్ పోరు

_ ఈసీ తీరుకు నిరసనగా ఢిల్లీ వేదికగా ఆందోళన

_ టీపీసీసీ బృందంతో కలిసి తరలివెళ్లిన తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు,అక్టోబర్ 11(అభయం న్యూస్):  రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీలో నిర్వహించనున్న భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి బయలుదేరి వెళ్లారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ జిల్లాల అధ్యక్షులతో కూడిన కాంగ్రెస్ ముఖ్య నేతల బృందం ఈ పర్యటనకు శ్రీకారం చుట్టింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... 'ఎస్‌ఐఆర్' ప్రక్రియలో భారీగా అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని మండిపడ్డారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వైఖరి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా ఉందంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి ఎన్నికల వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నాలను ఎండగడతామని స్పష్టం చేశారు.
దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, కేంద్ర ఈసీ తీరును ఎండగడుతూ ఢిల్లీ వేదికగా తమ గళాన్ని గట్టిగా వినిపిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.

Tags: