_ కాళికాదేవికి పట్టువస్త్రాలు సమర్పించిన బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి
_ ఆలయంలో ప్రత్యేక పూజలు
_ ప్రజలందరికీ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష
తాండూరు,అక్టోబర్ 18(అభయం న్యూస్): దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి తమ అపార భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. పట్టణంలోని కాళికా దేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పట్టు చీరను వస్త్రంగా సమర్పించి దేవి దివ్య ఆశీస్సులు అందుకున్నారు.
అనంతరం సరళా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. శరన్నవరాత్రుల శుభవేళ దుర్గామాత దివ్య అనుగ్రహం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని మనసారా ప్రార్థించిన్నట్లు తెలిపారు.







