Tandur

ప్రజల ప్రాణాలతో చెలగాటమా..!

By · · Updated

Share this article
ప్రజల ప్రాణాలతో చెలగాటమా..!

_ రద్దీ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుపై బీజేపీ ఆగ్రహం

 _ స్కూల్ విద్యార్థులు, వ్యాపారులు సంచరించే ప్రాంతంలో ప్రమాదకరంగా నిర్మాణాలు
 
_ మున్సిపల్ డీఈకి వినతిపత్రం సమర్పించిన నాయకులు

అభయం (తాండూరు టౌన్):తాండూరు పట్టణ నడిబొడ్డున ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణంలోని వినాయక చౌక్, పొట్లి మహారాజ్ ఆలయం ఎదురుగా నడిరోడ్డుపై విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు మంగళవారం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మున్సిపల్ డీఈ (DE)కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ... ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో ప్రతినిత్యం వందలాది మంది ప్రజలు, పాఠశాల విద్యార్థులు సంచరిస్తుంటారని, అంతేకాకుండా చుట్టూ వ్యాపార సముదాయాలు, నివాసాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్డు మధ్యలో ట్రాన్స్‌ఫార్మర్ వల్ల విద్యుత్ షాక్ వంటి జరగరాని ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.
నడిరోడ్డుపై నిర్మాణాలు చేపట్టి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఏర్పాటు చేస్తున్న దిమ్మను తొలగించి, అక్కడ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ నగరం మల్లేశం, 23వ వార్డ్ కౌన్సిలర్ అంతరం కిరణ్ లు ఉన్నారు.

Tags: