Tandur

పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకెళ్తాం.

By · · Updated

Share this article
పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకెళ్తాం.

_ తాండూరులో ఘనంగా ముగిసిన దసరా ఉత్సవాలు
_ విజయవంతం చేసిన ప్రజలకు, అధికారులకు హిందూ ఉత్సవ కేంద్ర సమితి కృతజ్ఞతలు
_ ఐకమత్యంగా ఉంటూ పండుగలను జరుపుకోవాలని పిలుపు

తాండూరు,అక్టోబర్ 21(అభయం న్యూస్): తాండూరు పట్టణంలోని బోనమ్మ గుడి వద్ద నిర్వహించిన దసరా ఉత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. ఈ వేడుకలను దిగ్విజయం చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన హిందూ బంధువులు, పెద్దలు, కుల సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేశారని సమితి ప్రతినిధులు వెల్లడించారు. అలాగే ఉత్సవాలు ప్రశాంతంగా, సజావుగా సాగేలా సహకరించిన మున్సిపల్, పోలీస్, ఫైర్ డిపార్ట్‌మెంట్లతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బందికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
పండుగలు అంటే అందరూ ఒకచోట చేరి తమ ఐక్యతను చాటుకోవడమేనని ఈ సందర్భంగా సమితి నాయకులు గుర్తుచేశారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయన్నారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ ...హిందూ బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం బోనమ్మ గుడి వద్ద జరిగిన దసరా వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కుల పెద్దలకు, ప్రజా ప్రతినిధులకు, సీనియర్ నాయకులకు, సహకరించిన మున్సిపల్, పోలీస్, ఫైర్ మరియు ఇతర డిపార్ట్‌మెంట్ల అధికారులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
నిన్నటి కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ ఫ్లాట్ విషయంలో జరిగిన సంఘటనపై స్పందిస్తూ — పెద్దలు ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చారని, పెద్దల సమక్షంలో కూర్చొని దానిని సరిదిద్దుకుంటామని సమితి ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చిన్నపాటి విషయాల్లో జరిగే పొరపాట్లను పెద్ద మనసుతో క్షమించి హిందూ బంధువులంతా ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
రాబోయే గణేష్ ఉత్సవాలు, దసరా వేడుకలతో పాటు ప్రతి పండుగను ఇదే ఐకమత్యంతో, ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ వేడుకల విజయవంతానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించిన సమితి సభ్యులందరికీ, సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Tags: