_ 6వ వార్డ్ లో వందా శాతం దిశగా ఎస్ఐఆర్
_ పక్క ఆధారాలతో నోటీసుల పరిష్కారం
_ ఓటర్లను అయోమయానికి గురి చెయ్యకండి
_ వార్డ్ కౌన్సిలర్ బోయ అనిల్
అభయం న్యూస్ తాండూరు టౌన్: పట్టణంలోని ఇందిరా నగర్ 6వ వార్డ్ లో వందా శాతం పూర్తి చేసే దిశగా ఎస్ఐఆర్ కొనసాగుతుందని స్థానిక కౌన్సిలర్ బోయ అనిల్ తెలిపారు. శనివారం ఓ ప్రకటనలో అనిల్ మాట్లాడుతూ.... ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందాన్నారు. అర్షులైన ప్రతి ఒక్కరికి ఓటు ఉండేలా, రెండు ఓట్లు ఉండకుండా చేపట్టిన ప్రక్రియ సజావుగా సాగుతుందని పేర్కొన్నారు. ఓటర్ జాబితా సవరణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిబంధనల ప్రకారమే...ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కావాలనే కొందరు ఓటర్లను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ ద్వారా సరైన ఆధారాలు అందుబాటులో లేని వారికీ నోటీసులు జారీ అయ్యాయాని తెలిపారు. సంబంధిత బిఎల్ఓ లను సంప్రదించి ఓటర్లకు అవసరమైన పత్రాలను అందజేసి ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదని అధికార యంత్రాంగం పారదర్శకంగా వ్యవహారిస్తుందని వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చెయ్యకుండా ఓటర్లు అందరు సద్వినియోగం చేసుకొని తమ ఓటును కాపాడుకోవాలని ఈ సందర్బంగా అనిల్ సూచించారు.
ఓటర్లలను అయోమయం లో పెట్టకండి..!
By Vamshi · · Updated
Share this article







