Tandur

ఒక్క గంప చెత్త తీసి డ్రామాలు ఆడొద్దు

By · · Updated

Share this article
ఒక్క గంప చెత్త తీసి డ్రామాలు ఆడొద్దు

_ వారానికి 2 గంటలు నాతో కలిసి మోరీలు తీద్దాం.. వస్తావా?

 _ 23వ వార్డు కౌన్సిలర్ కిరణ్‌కు కాంగ్రెస్ నాయకుడు దొరాశెట్టి సత్యమూర్తి బహిరంగ సవాల్

 _ ఫొటోల పబ్లిసిటీ కోసం అధికారులను భయపెట్టడం సరికాదని ఆగ్రహం

అభయం తాండూరు టౌన్:  వార్డులో ఒక్క గంప చెత్త తీసి, ఫొటోలు, వీడియోలకు ఫోజులిస్తూ ఇతరులపై నిందలు వేయడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొరాశెట్టి సత్యమూర్తి, 23వ వార్డు కౌన్సిలర్ కిరణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.     స్థానిక 23వ వార్డులో గురువారం కౌన్సిలర్ కిరణ్ స్వయంగా డ్రైనేజీలు శుభ్రం చేస్తూ, మున్సిపల్ అధికారులపై, కాంగ్రెస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలను ఆయన  ఖండించారు.
ఈ సందర్భంగా దొరాశెట్టి సత్యమూర్తి మాట్లాడుతూ.. ఐదు రోజుల క్రితం వార్డులో డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసన వస్తోందని స్థానిక ప్రజలు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. ఈ సమస్యను వెంటనే మున్సిపల్ ఛైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె తక్షణమే స్పందించి పారిశుధ్య కార్మికులను పంపి డ్రైనేజీలను శుభ్రం చేయించారని స్పష్టం చేశారు.
సమస్య పరిష్కారానికి కౌన్సిలర్ సానుకూలంగా స్పందించి వార్డు అభివృద్ధికి సహకరిస్తారని భావిస్తే, స్వయంగా డ్రైనేజీలు తీస్తూ అధికారులను, సిబ్బందిని బెదిరించేలా మాట్లాడటం తగదని మండిపడ్డారు. గెలిచిన గత 7 నెలలుగా వార్డు అభివృద్ధిని పట్టించుకోకుండా ఇప్పుడు ఈ నాటకాలు ఎందుకు ఆడుతున్నారని, ఇన్ని రోజులు ఈ మోరీలు ఎందుకు తీయలేకపోయారని సూటిగా ప్రశ్నించారు.
వార్డులోని డ్వాక్రా మహిళల సమావేశాలు ఎక్కడో ఎవరి ఇంట్లోనో జరుగుతున్నాయని, వార్డు అభివృద్ధి గురించి కానీ, ప్రజల సమస్యల పరిష్కారం గురించి కానీ ప్రశ్నించకుండా అనవసరంగా కాంగ్రెస్ నాయకులపై బురదజల్లడం సరికాదన్నారు.
కేవలం పబ్లిసిటీ ఫొటోల కోసం కాకుండా నిజమైన ప్రజాసేవ కోసం పనిచేయాలని కౌన్సిలర్‌కు హితవు పలికారు. వార్డు అభివృద్ధి కోసం నీతో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాంమని, నీలాగా ఫొటోల కోసం కాకుండా, ప్రజల శ్రేయస్సు కోసం వారానికి రెండు గంటల పాటు నువ్వు-నేను ఇద్దరం కలిసి వార్డులో మోరీలు తీద్దాం.. వస్తావా? అని కౌన్సిలర్ కిరణ్‌కు దొరాశెట్టి సత్యమూర్తి సవాల్ విసిరారు.

Tags: