Tandur

నీటిపై చర్చలు జరపాలి...!

By · · Updated

Share this article
నీటిపై చర్చలు జరపాలి...!

_ తాండూరులో నీటి ఎద్దడిపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పెట్టాలి

_ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చిన బీజేపీ నాయకులు

తాండూరు,అక్టోబర్ 24(అభయం న్యూస్):  తాండూరు పట్టణంలో ఎదురవుతున్న తీవ్ర నీటి ఎద్దడిపై తక్షణమే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ కమిషనర్ ను  కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు, ఫ్లోర్ లీడర్, 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం, 23వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. పట్టణంలో రోజురోజుకూ తాగునీటి కొరత తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నీటి నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉన్నందున, నీటి వనరుల సంరక్షణ మరియు వినియోగంపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.
నీటి సమస్యపై కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, భవిష్యత్తులో ప్రజలకు నీటి కొరత రాకుండా మున్సిపాలిటీ మరియు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని, పట్టణంలో పేరుకుపోయిన ఇతర సమస్యలను కూడా పరిష్కరించేందుకు వెంటనే మున్సిపల్ సమావేశం నిర్వహించాలని కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు.

Tags: