Tandur

నిరుద్యోగులకు భరోసా ఇస్తున్న కాంగ్రెస్

By · · Updated

Share this article
నిరుద్యోగులకు భరోసా ఇస్తున్న కాంగ్రెస్

_ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం

_ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

_ శంషాబాద్ సన్నాహక సమావేశానికి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

_ తాండూరు టౌన్ పార్టీ అధ్యక్షుడు బాతుల నాగరాజు 

తాండూరు, అక్టోబరు 22(అభయం న్యూస్): రంగారెడ్డి - హైదరాబాద్ - మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని తాండూరు టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాతుల నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ వేదికగా నిర్వహించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విస్తృత స్థాయి సన్నాహక సమావేశానికి తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు తాండూరు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గురువారం ఉదయం శంషాబాద్‌కు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా నాగు మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే నిరుద్యోగ యువతకు పెద్దపీట వేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటివరకు దాదాపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి మరో లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని తెలిపారు. గత పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టభద్రులను, నిరుద్యోగులను పూర్తిగా విస్మరించి వంచించిందని విమర్శించారు. కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పట్టభద్రులందరూ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారన్నారు.
నియోజకవర్గంలోని డిగ్రీ, అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన ప్రతీ పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా నాగరాజు విజ్ఞప్తి చేశారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొంది ఓటు వేసిన వారు సైతం నిబంధనల ప్రకారం తిరిగి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Tags: