Tandur

నెక్స్ట్ వీళ్లేనా..!

By · · Updated

Share this article
నెక్స్ట్ వీళ్లేనా..!

_ తాండూరులో   బీసీల చర్చ

_  రాజకీయాల్లో పెరుగుతున్న రచ్చ

_ బీసీ అభ్యర్థులపై ఆసక్తి 

_ లోకల్ బీసీ కే అవకాశం...! 

తాండూరు: అక్టోబర్ 09(అభయం న్యూస్): రాష్ట్రవ్యాప్తంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న
 బీసీ వాదం ఎఫెక్ట్ కచ్చితంగా తాండూరు రాజకీయాలపై పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 గత కొంతకాలంగా తాండూర్ నియోజకవర్గంలో జరుగుతున్న చర్చలు పరిణామాలను చూస్తుంటే కచ్చితంగా బీసీ వాదం తాండూర్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపడం మాత్రం ఖాయమని అనిపిస్తుంది. రాబోవు అసెంబ్లీ ఎన్నికలు ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇప్పటికే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన చర్చలు పరిశీలిస్తే నియోజకవర్గంలో ప్రజలు ఏ స్థాయిలో ఎన్నికల పట్ల ఆలోచిస్తున్నారు అనే విషయం తెలుస్తోంది.

 ప్రధాన రాజకీయ పక్షాలలో ఇప్పటికే బీసీ నాయకులు ఎవరి ప్రణాళికలు వారు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో బీసీల చర్చ జరుగుతున్న నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై స్పెషల్ ఫోకస్.

తాండూర్ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో గనుక తాండూరు సీటును అధికార కాంగ్రెస్ పార్టీ బీసీకి కేటాయించ వచ్చు అన్న టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కూడా బీసీ నినాదం తమ పార్టీ పై కూడా ప్రభావం చూపుతోందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో మాత్రం ఇప్పటికీ ఇలాంటి చర్చ జరగకపోవడం కూడా తాండూర్లో ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది.

 రానున్న ఎన్నికల్లో జిల్లాలో కచ్చితంగా ఏదో ఒక సీటు బీసీలకు కేటాయించాలి అనుకుంటే అది తాండూర్ నుండి కేటాయించాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో మంత్రిగా స్పీకర్గా ఉన్న ప్రసాద్ కుమార్ కు సీటు గ్యారెంటీ కావడమే కాకుండా వికారాబాద్ నియోజకవర్గం ఎస్సీ రిజల్ట్ స్థానం కావడంతో ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అటు జనరల్ గానే ఇటు బీసీ కి గాని కేటాయించలేదు. పరిధిలో ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు రెండు దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గా ఉండడమే కాకుండా డిసిసి పదవి కూడా నిర్వహించారు కనుక పరిగి స్థానం రామ్మోహన్ రెడ్డికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ లో కచ్చితంగా రేవంత్ రెడ్డి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులే పోటీలో ఉండే అవకాశం ఉంటుంది. కనుక తాండూరు స్థానాన్ని బీసీలకు కేటాయించవచ్చు అన్న చర్చ రోజు ఊపు అందుకుంటుంది.

 ఇక ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీలో కూడా పరిగిలో హరీష్ రెడ్డి గారి తనయుడు మహేష్ రెడ్డి గారికి పార్టీలో మంచి పట్టు ఉండడంతో ఆ సీటు కచ్చితంగా మహేష్ రెడ్డి కే కేటాయించే అవకాశాలు పూర్తిస్థాయిలో కనిపిస్తున్నాయి అంతేకాకుండా కొడంగల్ నియోజకవర్గంలో కూడా గతంలో ముఖ్యమంత్రి ని ఓడించిన నరేందర్ రెడ్డి కి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా అనుభవం ఉండడంతో కొడంగల్ స్థానం కూడా నరేందర్ రెడ్డి కి కేటాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అనేకారపనున్న రోహిత్ రెడ్డి అభ్యర్థిత్వం పట్ల నిలియనీడలు కనిపించడంతో టిఆర్ఎస్ పార్టీ కూడా తాండూర్ అసెంబ్లీ స్థానాన్ని బీసీల కేటాయిస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.ఇదే కనుక జరిగితే తాండూర్ లో పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే...

 అధికార కాంగ్రెస్ పార్టీ.:

 కాంగ్రెస్ పార్టీకి తాండూర్ నియోజకవర్గం మొదటి నుండి బీసీలకు కంచుకోటగా ఉండింది. మాణిక్ రావు చంద్రశేఖర్ నారాయణరావులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగడించారు. ఒకవేళ తాండూర్ నియోజకవర్గంలో మళ్లీ బీసీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే మహారాజుల కుటుంబంలో ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు మొదటి నుండి అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న రమేష్ మహారాజుకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. లేదా మారాజుల కుటుంబ సభ్యులందరూ కూడా ఏకమైతే వారి కుటుంబంలో ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో మరొక నాయకుడు మురళి గౌడ్ పేరు కూడా తీవ్రంగా ప్రచారం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపులో అన్నిటి అన్నయ్య వివరించిన మురళి గౌడ్ ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విజయంలో కూడా కీలక పాత్ర వహించడంతో  ఆయనకు "కింగ్ మేకర్ "గా తాండూర్ లో పేరు వచ్చింది. గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నప్పటికీ ఆయనకు నియోజకవర్గంలో యువకుల్లో ఉన్న పట్టు ఉండడంతోపాటు నియోజకవర్గంలో అన్ని మండలాలలో సత్సంబంధాలు ఉండడమే కాకుండా ఆర్థికంగా కూడా బలంగా ఉండటంతో మురళి గౌడ్ కూడా చివరి నిమిషంలో పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీలో ఉండొచ్చని చర్చ జరుగుతుంది.అంతేకాకుండా నియోజకవర్గంలో గత కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న కంచర్ల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.

 బిఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే..

 తాండూర్ లో రోహిత్ రెడ్డి గత సంవత్సర కాలంగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాళ్ల బాబాయి శ్రీశైలం రెడ్డికి నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు అప్ప చెప్పినారు. పార్టీ నుండి రోహిత్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో బి ఆర్ ఎస్ పార్టీలో ఇప్పటికిప్పుడు కొత్త నాయకత్వం కూడా కనిపించడం లేదు. ఈ సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ కూడా ఒక స్థానం బీసీ కేటాయించాలి అనుకుంటే తాండూర్ నియోజకవర్గంలో డాక్టర్ సంపత్ కుమార్ కు అవకాశాలు కలిసి వస్తాయని తీవ్ర చర్చ జరుగుతోంది. త్వరలో నియోజకవర్గ స్థాయిలో డాక్టర్ సంపత్ కుమార్ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక చేసుకుంటుండడంతో ఈ చర్చ మరింత బలంగా మారింది. మరొక బీసీ నాయకుడు రాజు గౌడ్ కూడా పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ ఆర్థికంగా బలంగా ఉన్న డాక్టర్ సంపత్ కుమార్ కు టికెట్ దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 బరిలో కొత్త అభ్యర్థులు..

 బీసీ వాదం బలపడుతుండడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకర్ యాదవ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ సంఘం నాయకులతో కలిసి చర్చలు చేస్తున్నప్పటికీ ఏ రాజకీయ పక్షానికి అనుబంధంగా లేకపోవడంతో కొంతవరకు శంకర్ యాదవ్ అభ్యర్థిత్వంపై అనుమానం నెలకొని ఉంది. అవకాశం దొరికితే ఇంకా కొంతమంది బీసీ నాయకులు కూడా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీసీ నియోజకవర్గ కన్వినర్ రాజకుమార్ కూడా బీసీ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. తాండూరు ప్రాంతంలో బీసీలు ఎవరు ముందుకు రాకుంటే ఖచ్చితంగా అయన పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 

 ఏది ఏమైనా ప్రజల్లో పెరుగుతున్న బీసీ వాదం రానున్న ఎన్నికల్ల ఫలితాలుబీసీల నిర్ణయంపై ఉంటాయి అనుకోవడంలో  ఎలాంటి సందేహం లేదని అన్ని రాజకీయ పక్షాల్లోని కార్యకర్తలు బాహాటంగా ప్రకటిస్తున్నారు.

Tags: