Tandur

నర్సింలు ఇంటికి ‘శ్రీనన్న’...!

By · · Updated

Share this article
నర్సింలు ఇంటికి ‘శ్రీనన్న’...!

_ మనుమడికి ఆశీస్సులు

_ కుటుంబం తో మాట ముచ్చట

అభయం (తాండూరు టౌన్):తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పెట్లోళ్ల నర్సింలు, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ రత్నమాల దంపతుల నివాసానికి కాంగ్రెస్ నాయకులు, ఆర్బిఓఎల్  బుయ్యని శ్రీనివాస్ రెడ్డి  సోమవారం  వెళ్లారు.
ఇటీవల పెట్లోళ్ల నర్సింలు-రత్నమాల దంపతుల కుమార్తె సంధ్య, అశోక్ రెడ్డిల కుమారుడు ఆధర్వ స్కందారెడ్డి మొదటి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలో అనివార్య కారణాల వల్ల ఈ వేడుకలకు హాజరుకాలేకపోయిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సోమవారం ప్రత్యక్షంగా నర్సింలు ఇంటికి వెళ్లారు.
ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి  ఆధర్వ స్కందారెడ్డిని ఎంతో ఆప్యాయంగా ఎత్తుకొని, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. బాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం పెట్లోళ్ల నర్సింలు కుటుంబ సభ్యులతో శ్రీనివాస్ రెడ్డి  ముచ్చటించారు.

Tags: