Tandur

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

By · · Updated

Share this article
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

_ పగటిపూటా వెలుగుతున్న వీధిదీపాలు

– ఎమ్మెల్యే ‘స్పెషల్ డ్రైవ్’లో ఇవి కనిపించలేదా?

– 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ తీవ్ర ఆవేదన

అభయం తాండూరు టౌన్:  పట్టణంలో మున్సిపల్ అధికారుల ఉదాసీనత వల్ల ప్రభుత్వ ఆదాయానికి  గండి పడుతోందని 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ ఆరోపించారు. వార్డుల్లోని వీధిదీపాలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటల పాటు నిరంతరం వెలుగుతూనే ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
 స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పట్టణంలో ప్రత్యేక డ్రైవ్  నిర్వహించి వీధిదీపాల తీరును పరిశీలించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించినా పగటిపూట వెలుగుతున్న ఈ లైట్లు ఆయన కంటికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. వార్డుల్లో వీధిదీపాలకు ప్రత్యేకంగా విద్యుత్ కనెక్షన్లు లేకపోవడం, ఆన్/ఆఫ్ చేసేందుకు స్విచ్‌లను అమర్చకపోవడమే ఈ విద్యుత్ వృథాకు ప్రధాన కారణమని మండిపడ్డారు. 
పట్టణంలోని ప్రతి వార్డులో వీధిదీపాలకు వెంటనే ప్రత్యేక విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని కౌన్సిలర్ జావీద్ డిమాండ్ చేశారు. అవసరం ఉన్నప్పుడే లైట్లు వేసేలా స్విచ్‌లను ఏర్పాటు చేసి, ప్రభుత్వ ధనాన్ని, విద్యుత్‌ను కాపాడాలని మున్సిపల్ అధికారులను కోరారు.

Tags: