Tandur

మిసైల్ మ్యాన్ సేవలను విస్మరిస్తే ఎలా?

By · · Updated

Share this article
మిసైల్ మ్యాన్ సేవలను విస్మరిస్తే ఎలా?

_ కలాం జయంతి వేడుకలు నిర్వహించకపోవడం బాధాకరం

— తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ జావేద్ ఆవేదన

తాండూరు, అక్టోబర్ 15(అభయం న్యూస్): 
దేశ రక్షణ రంగానికి ఎనలేని సేవలు అందించి 'మిసైల్ మ్యాన్'గా గుర్తింపు పొందిన మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించకపోవడం అత్యంత బాధాకరమని తాండూరు మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు.  దేశానికి న్యూక్లియర్ రక్షణ సాంకేతికతను అందించిన గొప్ప శాస్త్రవేత్త, ప్రపంచంలోనే ప్రముఖ సైంటిస్టుల సరసన నిలిచే మహానీయుడైన కలాంను ఈ రోజు స్మరించుకోకపోవడం శోచనీయమన్నారు. తాండూరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, అధికార యంత్రాంగం కలాం జయంతిని విస్మరించడం సరైంది కాదన్నారు. మాజీ రాష్ట్రపతి, దేశానికి న్యూక్లియర్ మిసైల్స్ అందించి శత్రు దేశాల నుండి దేశాన్ని రక్షించిన గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం అని వక్త కొనియాడారు. ఆయన యువతకు ఎంతో స్ఫూర్తిదాత అని, ఆయన జీవితాన్ని మోటివేషన్‌గా తీసుకుని పిల్లలను ముందుకు నడిపించాలని తెలిపారు.  
యువతకు మరియు ప్రజలకు డాక్టర్ అబ్దుల్ కలాం ఆశయాలు, వ్యక్తిత్వం గురించి తెలియజేసేందుకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆయన జయంతి మరియు వర్ధంతి వేడుకలను ప్రతి ప్రాంతంలో అధికారికంగా ఘనంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఏడాది నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం అబ్దుల్ కలాం జయంతిని అధికారికంగా నిర్వహించాలని, అన్ని మున్సిపల్ కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల్లో ఘనంగా జరపాలని సూచించారు.

Tags: