Tandur

మారని పాఠశాలల తీరు ...!

By · · Updated

Share this article
మారని పాఠశాలల తీరు ...!

_ విద్యార్థి సంఘాలు సందర్శించిన రాని చలనం 
_ సాయంత్రం 7గంటల వరకు పాఠశాల నిర్వహణ 
_ విద్యార్థులపై అధిక భారం మోపుతున్న ప్రైవేట్ పాఠశాలలు 

అభయం తాండూరు టౌన్: పాఠశాలలకు సంతోషంగా,ఉత్సహంగా వెళ్లాల్సిన విద్యార్థులు భయంతో, మానసిక ఒత్తిడితో వెళ్లాల్సిన పరిస్థితి నెల్కొంది. ఉదయం 7 నుండి సాయంత్రం 7  గంటల వరకు పాఠశాల నిర్వహించడం, దానికి తోడు అధిక హోమ్ వర్క్ లు ఇవ్వడం తో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి రోజు రోజుకు పెరిగిపోతుంది. గత 4 రోజుల క్రితం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలను సందర్శించి హెచ్చరించిన ప్రైవేట్ పాఠశాలల తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటి నుండే 10వ తరగతి క్లాస్ లతో పాటు 9వ తరగతి విద్యార్థులకు కూడా స్పషల్ క్లాస్ లు నిర్వహించడం గమనార్షం. ఈ వ్యవహారం పై స్థానిక విద్యార్థి సంఘాలు స్పందించిన ఫలితం శూన్యం గా మారింది. రోజు రోజు కు పెరుగుతున్న ప్రైవేట్ పాఠశాల దౌర్జన్యం పై ప్రశ్నించే వారే కరువైయ్యారు. విద్యార్థి సంఘాలు స్పందించి, విద్య శాఖ మాత్రం కళ్లు మూసుకొని కూర్చుంది. ఇప్పటి దాక ప్రైవేట్ పాఠశాలపై విద్య శాఖ అధికారులు స్పందించకపోవడం విడ్డురం.

Tags: