Tandur

మరమ్మతు పనులే ముంచేశాయి

By · · Updated

Share this article
మరమ్మతు పనులే ముంచేశాయి

_ బోరు మోటార్ బాగుచేస్తూ విద్యుత్ షాక్‌తో రైతు మృతి.. 
_ తమ్ముడికి గాయాలు

_ పెద్దేముల్ లో ఘటన 

పెద్దేముల్ అక్టోబర్ 25(అభయం న్యూస్): కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే ఆ ఇంట విద్యుత్ షాక్ తీరని శోకాన్ని నింపింది. బోరు మోటార్ మరమ్మతులు చేస్తుండగా చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదంలో అన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తమ్ముడు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ తీవ్ర విషాద సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోపాల్‌పూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం... గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన తింసాన్ పల్లి బిచ్చప్ప (40) తన తమ్ముడు అశోక్‌తో కలిసి చేను వద్ద ఉన్న బోరు మోటార్‌కు మరమ్మతులు చేపట్టాడు. పనుల్లో మునిగిపోయిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో బిచ్చప్ప తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే కన్నుమూశాడు. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ఆయన తమ్ముడు అశోక్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కళ్లముందే అన్న ప్రాణాలు కోల్పోవడంతో తమ్ముడు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags: