Tandur

కోలాహలంగా బతుకమ్మ ఉత్సవాలు

By · · Updated

Share this article
కోలాహలంగా బతుకమ్మ ఉత్సవాలు

_ ఆదర్శ తులసినగర్‌లో కన్నులపండువగా బతుకమ్మ వేడుకలు

_ అలరించిన పూల జాతర.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

_ గంజిపల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో వేడుకలు

_ ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు

తాండూరు,అక్టోబర్ 18(అభయం న్యూస్):  తాండూరు పట్టణంలోని ఆదర్శ తులసినగర్ పూల పరిమళాలు, గౌరమ్మ పాటలతో మురిసిపోయింది. గంజిపల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు కాలనీవాసులకు సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి.
ఈ వేడుకలకు తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ నీరజ బాల్రెడ్డి, 11వ వార్డు కౌన్సిలర్ బంటు వేణు, 10వ వార్డు కౌన్సిలర్ అల్లాపూర్ శ్రీకాంత్, బీజేపీ నాయకులు రజినీకాంత్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాలనీ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో రకరకాల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను ప్రదర్శించి దైవభక్తిని చాటుకున్నారు. అనంతరం అందరూ ఒకచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ కాలనీ ప్రాంగణాన్ని కోలాహలంగా మార్చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రకృతిని పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. వార్డు ప్రజలంతా ఐకమత్యంతో ఇటువంటి వేడుకలను జరుపుకోవడం అభినందనీయమని తెలుపుతూ, ఆడపడుచులందరికీ పండుగ శుభాకాంక్షలు అందించారు.

Tags: