_ 58 పరుగులతో బిగ్ బాష్ లీగ్ కప్ కైవసం
_ ఆకట్టుకున్న ఫైనల్ పోరు: అమన్ సీసీపై ఘన విజయం
_వినయ్ రాజ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', పార్థ మెష్‌కి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'
_ విజేత జట్టుకు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక అభినందనలు
తాండూరు, అక్టోబర్ 18 (అభయం న్యూస్): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అత్యంత వైభవంగా, ఉత్కంఠభరిత వాతావరణంలో జరిగిన బిగ్ బాష్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో బిఎస్ఆర్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన రసవత్తరమైన తుది పోరులో బిఎస్ఆర్ జట్టు అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అమన్ సీసీ జట్టును 58 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి విజేతగా నిలిచి, ట్రోఫీని ముద్దుపెట్టుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బిఎస్ఆర్ జట్టు నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు నమోదు చేసి ప్రత్యర్థి ముందు కఠినమైన లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన అమన్ సీసీ జట్టును బిఎస్ఆర్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్‌తో కట్టడి చేశారు. దాంతో అమన్ సీసీ జట్టు నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోలేక ఓటమిపాలైంది.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఘన విజయాన్ని అందించిన బిఎస్ఆర్ టీమ్ కెప్టెన్ వినయ్ రాజ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నారు. ఇకపోతే టోర్నీ ఆసాంతం తన ఆల్ రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న పార్థ మెష్ ఠాక్రి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' పురస్కారాన్ని కైవసం చేసుకుంది.
మ్యాచ్ పూర్తయిన అనంతరం బుయ్యని శ్రీనివాస్ రెడ్డి విజేత జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ
ప్రాంత క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఎంతో తోడ్పడతాయని అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరచి విజేతగా నిలిచిన బిఎస్ఆర్ జట్టు సభ్యులను, కెప్టెన్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.







