Tandur

కలెక్టర్ వద్దకు స్మశానవాటిక పంచాయతీ..!

By · · Updated

Share this article
కలెక్టర్ వద్దకు స్మశానవాటిక పంచాయతీ..!

_ ఎస్సీ స్మశానవాటిక, ఎఫ్‌టీఎల్ భూములు కబ్జా 

_ రాత్రికి రాత్రే స్మశానవాటిక నేలమట్టం.. రోడ్ల నిర్మాణం

_ కలెక్టర్‌కు దళిత ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఫిర్యాదు

తాండూరు, అక్టోబర్ 14 (అభయం న్యూస్):
తాండూరు పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 3లో ఉన్న ఎఫ్‌టీఎల్ భూములతో పాటు ఎస్సీ స్మశానవాటిక స్థలాన్ని ఆక్రమణదారులు కబ్జా చేసి అక్రమ లేఅవుట్లు వేస్తున్నారని  దళిత ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడూతూ.. సర్వే నంబర్ 3లోని దాదాపు 18.22 ఎకరాల ఎఫ్‌టీఎల్ భూమిని, దళితుల స్మశానవాటికను అక్రమార్కులు ఆక్రమించారని ఆరోపించారు. స్మశానవాటికను రాత్రికి రాత్రే నేలమట్టం చేసి, రోడ్లు సైతం నిర్మించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై గతంలో ఎమ్మార్వో, ఆర్డీవో లకు విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ భూములు, స్మశానవాటికను అక్రమంగా లేఅవుట్లుగా మార్చి విక్రయిస్తున్నారని, కావున ఈ భూమిని వెంటనే 22(a)  నిషేధిత జాబితా లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ నిర్మాణాలను నిలిపివేసి కబ్జాదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, దళితుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత సొసైటీ నాయకులు జంటుపల్లి వెంకట్, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags: